పుతిన్‌ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?

15 May, 2022 19:18 IST|Sakshi

ఉక్రెయిన్‌ పై రష్యా దురాక్రమణకు దిగినప్పటకి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యం పై రకరకాలు ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పుతిన్‌ తీవ్ర అనారోగ్యంగా గురయ్యాడని బ్రిటీష్‌ మాజీ గూఢచారి చెబుతున్నాడు. అంతేగాదు ఆ అనారోగ్యం ఏమిటో తనకు స్పష్టంగా తెలియదని, నయం చేయలేనంత భయంకరమైన రోగమా? కాదా అనేది కూడా స్పష్టంగా తెలియదంటూ చెప్పుకొచ్చారు.

ఈ మేరకు ఆ గూఢచారి.. పుతిన్‌ ఉక్రెయిన్‌ పై దాడికి దిగడం వల్లే ఇలాంటి అనారోగ్యానికి గురయ్యాడంటూ విమర్శించారు. 2016లో యూఎస్‌ ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యాన్ని ఖండించిన క్రిస్టోఫర్‌ స్టీల్‌  మనకు రకరకాలుగా అందుతున్న సమాచారాల ఆధారంగా పుతిన్‌ నిజంగానే అనారోగ్యంగా ఉండి ఉండొచ్చు అన్నారు. మరోవైపు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్న రష్యన్‌ అధికారి ఒకరు పుతిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెప్పడం విశేషం. అంతేగాదు అతను వెంచర్‌ క్యాపిటలిస్ట్‌తో జరిగిన చర్చల్లో  పుతిన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లు యూఎస్‌ మ్యాగజైన్‌ న్యూలైన్స్‌ పేర్కొంది.

ఇటీవలే జరిగిన విక్టరీ డే వేడుకలలో కూడా పుతిన్‌ చాలా బలహీనంగా ఉన్నారు. అదీగాక పుతిన్ మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సైనిక కవాతును వీక్షించడానికి రెండవ ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞులు, సీనియర్ ప్రముఖుల మధ్య కూర్చున్నప్పుడు కూడా అతని కాళ్ళపై దట్టమైన ఆకుపచ్చ కవర్ ఉంది. పైగా ఇటీవల, పుతిన్  రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మధ్య జరిగిన వీడియో సమావేశంలో టేబుల్‌ని గట్టిగా పట్టుకుని కూర్చొన్నాడు. ఇవన్నీ కూడా పుతిన్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేందుకు బలం చేకూరుస్తున్నాయి.

అంతేగాదు పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించే కొద్దిసేపటి ముందు అతని వెనుక భాగంలో శస్త్రచికిత్స చేయించుకున్నారని ఆ రష్యన్‌ అధికారి చెప్పడం గమనార్హం. పుతిన్‌ చనిపోవాలనే మేమందంరం కోరుకుంటున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు  చేశాడు. అతను రష్యా ఆర్థిక వ్యవస్థను, ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి అతను పూర్తిగా నాశనమయ్యాడంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఉక్రేనియన్ మిలిటరీ ఉన్నతాధికారి కూడా పుతిన్‌ అనారోగ్యం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

(చదవండి: పుతిన్‌ పదవి నుంచి తప్పుకోక తప్పదు!...రష్యా కూలిపోవడం ఖాయం)

మరిన్ని వార్తలు