పోలియోపై పోరుకు గేట్స్‌ ఫౌండేషన్‌ రూ.9.8 వేల కోట్ల విరాళం

18 Oct, 2022 07:42 IST|Sakshi

బెర్లిన్‌: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్‌ కొత్త వేరియంట్‌ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది.  పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది.  ఇటీవలే పాకిస్తాన్‌లో 20, అఫ్గానిస్తాన్‌లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్‌ చేసింది బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌. 

ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్‌ గేట్స్‌!

మరిన్ని వార్తలు