వర్క్‌ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!

11 Dec, 2021 14:40 IST|Sakshi

German Court Rule Pass It Is Work Place Accident: ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు ఆఫీసులన్ని తమ ఉద్యోగులను వర్క్‌ప్రం హోంకి పరిమితం చేశాయి. అయితే ఈ మధ్య మళ్లీ కొంతకాలంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ బాస్‌లు ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ దెబ్బకు చాలా వరకు విదేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోం అంటూ ఇళ్ల నుంచే వర్క్‌ చేయండి అంటూ సూచించింది. దీంతో ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే వర్క్‌ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ వర్క్‌ ఫ్రం హొంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు మీకు ఇంటి వద్ద ఏదైన అనుకోని ప్రమాదం జరిగితే  భీమా వర్తించదంటున్నాయి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు

(చదవండి: గిరిజన సంప్రదాయ నృత్యంతో అలరించిన ప్రియాంక గాంధీ : వైరల్‌ వీడియో)

అసలు విషయలోకెళ్లితే. ...జర్మనీలోని వ్యక్తి  ఒక రోజు ఉదయమే లేచి సరాసరి వర్క్‌ చేయడానికి అని తన ఇంటిలోని ఆఫీస్‌ రూంకి వెళ్తుండగా మెట్టమీద నుంచి జారిపడిపోతాడు. దీంతో సదరు వ్యక్తికి వెన్నముకకు తీవ్రంగా గాయమవుతుంది. అయితే సదరు ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన  భీమా సంస్థ ఆ వ్యక్తి ఇంటివద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి కంపెనీకి సంబంధించిన బీమా పాలసీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశం లేదంటూ నిరాకరిస్తుంది.

దీంతో అతను న్యాయం కావాలంటూ జర్మనీ ఫెడరల్ కోర్టులో సదరు కంపెనీకి సంబంధించిన భీమా సంస్థ పై పిటిషన్‌ దాఖలు చేస్తాడు. అయితే కోర్టు అతను ఉదయం ఇంటి కార్యాలయంలో పనిచేయడానికి వెళ్తున్నప్పుడు జరిగింది కాబట్టి పరిహారం పొందేందుకు అర్హుడంటూ కోర్టు తీర్పు ఇస్తుంది. ఈ మేరకు సదరు బీమా సంస్థ ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే మార్గంలో తప్ప ఇంటి వద్ద జరితే ప్రమాదాలకు వర్తించదు అంటూ వాదించడానికి ప్రయత్నిస్తుంది. అయితే కోర్టు ఆ వాదనను తోసిపుచ్చి అతను ఎక్కడ ఉన్న పనిచేయడానికి వెళ్తున్నప్పుడే జరిగింది కాబట్టి సదరు వ్యక్తికి బీమా వర్తిస్తుందంటూ తీర్పు ఇస్తుంది.

(చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ)

మరిన్ని వార్తలు