అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన తప్పదా?

1 Oct, 2023 05:31 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది.

రిపబ్లికన్ల డిమాండ్‌ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్‌లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్‌ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నారు. అదే జరిగితే  20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు.

మరిన్ని వార్తలు