‘క్యూబూల్‌ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు

27 May, 2021 16:52 IST|Sakshi

స్టాక్‌హోమ్: పెళ్లి అనేది నూరేళ్ల పంట. వివాహం అనేది ప్రతి జంట జీవితంలో  ప్రత్యేకమైన రోజు. అయితే కొంతమంది కాబోయే దంపతులకు ప్రణాళిక ప్రకారమే అన్నీ జరుగుతాయా అనే ఆందోళన ఉంటే..మరికొందరు ఆనందంగా ఉంటారు. అయితే తాజాగా స్వీడన్‌కి చెందిన ఓ పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ‘క్యూబూల్‌ హై’( నేను అంగీకరిస్తున్నాను) అని చెప్పిన వెంటనే వధువు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆనందంతో ఎగిరి గంతేసింది. వరుడిని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. కాగా ఈ వీడియోలో వివాహానికి వచ్చిన అతిథలు చుట్టూ వరుసలో కూర్చున్నారు.

అయితే వధువు మొదట తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సంశయించినా...బంధువుల ప్రోత్సాహంతో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను ‘‘నిత్యం సంతోషంగా ఉండే భార్య’’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా..15 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వధువు ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన వధూవరులు సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.  ఇక దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "మీ ఇద్దరికీ అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు. అయితే మరో నెటిజన్‌ "ఇప్పుడు రక్తం పీల్చడానికి లైసెన్స్ పొందండి." అంటూ చమత్కరించారు.
 

A post shared by |~|@m€€[) (@romantic_cute_prince)

(చదవండి: ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు