హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా

2 Dec, 2021 06:14 IST|Sakshi

తెగూసిగల్పా(హోండూరస్‌): సెంట్రల్‌ అమెరికా దేశమైన హోండూరస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్‌ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్‌ రీఫౌండేషన్‌ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. 

మరిన్ని వార్తలు