ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.. | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..

Published Thu, Dec 2 2021 6:17 AM

Today Horoscope Telugu 02-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.త్రయోదశి సా.6.14 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం స్వాతి ప.2.55 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం రా.8.11 నుండి 9.40 వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుండి 10.41 వరకు తదుపరి ప.2.22 నుండి 3.06 వరకు అమృతఘడియలు... ఉ.6.32 నుండి 8.02 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: పనులు సకాలంలో పూర్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

సింహం: కొత్త వ్యవహారాలలో పురోగతి. కోర్టు కేసుల పరిష్కారం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: రుణాలు చేస్తారు. శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.

వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు పరిష్కారం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మీనం: ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు.

Advertisement
Advertisement