Chinese Apps Ban: మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం!

14 Feb, 2022 11:28 IST|Sakshi

India plans to ban 54 Chinese apps: దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు నిషేధించిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్‌, ఆన్‌మోజీఎరినా, యాప్‌లాక్‌, డ్యూయల్‌ స్పేస్‌ లైట్‌లు వంటివి ఉన్నాయి.

గతేడాది జూన్‌లో దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ విస్తృతంగా ఉపయోగించే  టిక్‌టాక్, వీచాట్, హెలో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. పైగా మే 2020లో చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యలంఓ భారత్‌ దాదాపు 300 యాప్‌లను బ్లాక్‌ చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో జూన్ 2020లో తొలిసారిగా భారత్‌ ఈ నిషేధాన్ని ప్రకటించింది.

(చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్‌.. ఎలాగో తెలుసా!!)

మరిన్ని వార్తలు