ఇజ్రాయెల్‌ ప్రధానిగా నెతన్యాహూ

5 Nov, 2022 05:25 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్‌ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్‌ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్‌ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్‌ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్‌ చేసి అభినందించారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్‌ దాడులు
ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్‌ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు గాజాలో హమాస్‌ గ్రూప్‌ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి.

మరిన్ని వార్తలు