తైవాన్‌ విషయంలో ఫుల్‌ క్లారిటీ ఇస్తూ.. మెలిక పెడుతున్న అమెరికా!

19 Sep, 2022 12:00 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ ఫెలోసీ తైవాన్‌ పర్యటన ఎంత వివాదాస్పదమైంతో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా చైనా అమెరికాపై కస్సుమంటూ తైవాన్‌ సరిహద్దుల్లో సైన్యం మోహరింప చేసి యుద్ధాని రెడీ అంది. ఎంతగా అమెరికా నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వినకపోగా యుద్ధ కాంక్షతో రగిలిపోయింది.

దీంతో అమెరికా కూడా తైవాన్‌పై దాడి చేస్తే ఊరుకోనని చైనాకి స్ట్రాంగ్‌కి వార్నింగ్‌ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య తైవాన్‌ విషయమై చిచ్చు మొదలైంది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ని మీడియా ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ లాగా ఆయుధాల సాయం కాకుండా యూఎస్‌ దళాలు తైవాన్‌ దేశాన్ని రక్షించడానికి ముందుకు వస్తాయా అని ప్రశ్నించిగా....దీనికి బైడెన్‌ చైనా దాడి చేసేందుకు రెడీ అయ్యితే కచ్చితంగా యూఎస్‌ దళాలు తైవాన్‌ని రక్షించేందుకు వస్తాయని నర్మగర్భంగా చెప్పారు.

ఔను! తైవాన్‌ రక్షించుకోవమే కాకుండా తైవాన్‌ విషయంలో యూఎస్‌ తన నిబద్ధతకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఐతే తాము తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్ధతు ఇవ్వలేదంటూ ఝలక్‌ ఇచ్చారు. అలాగే బీజింగ్‌కి సంబంధించిన చైనా వన్‌ పాలసీ విధానానికి వాషింగ్టన్‌ అధికారికంగా గుర్తించడమే కాకుండా దానికి  కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఐతే తైవాన్‌ విషయంలో కాదని ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

(చదవండి: క్వీన్‌ ఎలిజబెత్‌2: ఆమెతో ఉన్నప్పుడూ మా అమ్మ గుర్తుకొచ్చింది.. బైడెన్‌ భావోద్వేగం)
 

మరిన్ని వార్తలు