అప్పు వంకతో నీచమైన పనులు

2 Apr, 2022 14:03 IST|Sakshi
నిందితురాలు టైలర్‌ జో వాకర్‌

తనకు బాకీ పడ్డ సొమ్మును తీర్చేందుకు ఓ అమ్మాయికి దారుణమైన పనిని అప్పగించింది ఓ యువతి. ఒకరోజులో 17 మందితో.. వ్యభిచారం చేయాలని  ఒత్తిడి చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు ఆ పని చేసింది.  విషయం బాధితురాలి తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో.. కోర్టుకు చేరుకుంది ఈ అఘాయిత్యం.

ఇంగ్లండ్‌లో వ్యభిచారం చట్టవిరుద్ధమైన చోట ఎస్కార్ట్‌ ఏజెన్సీలు వెలుస్తుంటాయి. డబ్బు తీసుకుని క్లయింట్లకు తోడును అందించడం ఈ ఏజెన్సీల పని. అలాంటి ఏజెన్సీలో పనిచేస్తోంది 23 ఏళ్ల జార్జియా అలియాస్‌ టైలర్‌ జో వాకర్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సదరు టీనేజర్‌తో పరిచయం పెంచుకుంది. ఆపై ఆర్భాటాల ద్వారా ఆ టీనేజర్‌ను ఎట్రాక్ట్‌ చేసింది.

సుందర్ల్యాండ్‌లోని  తన అపార్ట్‌మెంట్‌కు రావాల్సిందిగా  యువతిని ఆహ్వానించింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది సదరు యువతి. ఇందుకోసం ట్యాక్సీ, ఇతర ఖర్చులను కూడా వాకరే భరించింది. ఆపై యువతిని అభ్యంతరకరంగా చిత్రీకరించింది.  ఆపై యువతి వయసును 18 ఏళ్లుగా చెబుతూ.. ఫొటోలతో సహా ఎస్కార్ట్‌ఏజెన్సీ ప్రొఫైల్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీంతో క్లయింట్‌లు వాకర్‌ ఇంటికి రాగా.. యువతి భయంతో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే బాకీ తీర్చకపోతే వ్యక్తిగత ఫొటోల్ని బయటపెడతానని బెదిరించింది వాకర్‌. పైగా తాను చెప్పినపని చేస్తే తక్కువ టైంలో బోలెడంత డబ్బు వస్తుందని టీనేజర్‌కు ఆశపెట్టింది. 

అలా రెండు వారాల్లో 30 మందితో బలవంతంగా చేయికూడని పనులు చేయించింది. వచ్చిన సొమ్ములో 700 పౌండ్లను వాకర్‌ తీసుకోగా.. 3000 పౌండ్లు మాత్రం యువతికే ఇచ్చింది. దీంతో మురిసిపోయిన యువతి లగ్జరీ ఐటెమ్స్‌తో ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

నేరం ఒప్పుకున్న వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష, అక్కడి చట్టాల ప్రకారం.. నిరుద్యోగ భృతి కింద అందాల్సిన వేతనంలోనూ రెండేళ్లపాటు కోత విధిస్తున్నట్లు న్యూక్యాజిల్‌ క్రౌన్‌ కోర్టు Newcastle Crown Court తీర్పు ఇచ్చింది. అంతేకాదు వాకర్‌ను మరోసారి వ్యభిచారం వైపు మళ్లకుండా చూడాలంటూ ఆమె తరపు న్యాయవాదిని జడ్జి ఆదేశించింది.

మరిన్ని వార్తలు