మాల్దీవుల్లో ఘోర అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది భారతీయుల దుర్మరణం

10 Nov, 2022 12:38 IST|Sakshi

మాలే: మాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదకొండు మంది దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. విదేశీ వలస కార్మికులు ఉంటున్న ఇరుకైన వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటు  చేసుకున్నట్లు తెలుస్తోంది. 

బిల్డింగ్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న వెహికిల్‌ రిపేర్‌ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. పైఫ్లోర్‌లకు విస్తరించినట్లు అధికారులు ధృవీకరించారు. నాలుగు గంటలపాలు మంటలు చెలరేగుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా చోటుచేసుకుందని సమాచారం. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి. విదేశీ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి. మాలే జనాభా రెండున్నరల లక్షలుగా ఉంటే.. అందులో బంగ్లాదేశ్‌, భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక నుంచే సగం జనాభా ఉంది.

మరిన్ని వార్తలు