మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్‌

31 Mar, 2022 12:48 IST|Sakshi

Dance with a crocodile: మాములుగా మొసలి అంటే ఎవరైన భయపడతాం. గతంలో దానితో సాహసోపేతమైన ఫీట్‌లు చేసి భంగపాటుకు గురైనవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ఇక అంతే సంగతులు. అలాంటిది ఇక్కడొక వ్యక్తి ఏకంగా మొసలితో డ్యాన్స్‌ చేస్తున్నాడు.

వివరాల్లోకెళ్తే...ఫ్లోరిడాలోని ఒక వ్యక్తి మొసలితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. నిజానికి మొసలి కనబడితేనే భయంతో అమాంతంగా పారిపోతం. కానీ ఈ వ్యక్తి ఏకంగా దానితో కలిసి నీళ్లల్లో ఎంచక్కా చిందులు వేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్ట్రాగ్రాంలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇంతకీ ఆ మొసలి బతికే ఉంటే అతను అలా డ్యాన్స్‌ చేయలేడు అంటూ రకరకాలుగా పోస్టులు పెట్టారు.

A post shared by MEMES | COMEDY | CULTURE (@bitchreject)

(చదవండి: ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా.. 110 రోజుల్లో)

మరిన్ని వార్తలు