అంతరిక్షంలో నాసా మరో ప్రయోగం..

27 Jul, 2020 19:22 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) త్వరలో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలో మానవులు జీవించడానికి న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లను(అణు విద్యుత్‌) నిర్మించనుంది. కొత్తగా నిర్మించే న్యూక్లియర్‌ ప్లాంట్‌లు ద్వారా చంద్రుడు(మూన్‌), అంగారకుడు(మార్స్) ప్రదేశాలలో శక్తిని అందిస్తుందని నాసా పేర్కొంది. ఈ క్రమంలో ప్లాంట్‌లను నిర్మించడానికి ప్రైవేట్‌ న్యూక్లియర్‌ సంస్థల సలహాలను నాసా కోరింది. అయితే చిన్న న్యూక్లియర్‌ రియాక్టర్లు(అణు రియాక్టర్లు) అంతరిక్ష ప్రయోగాలకు కావాల్సిన శక్తిని అందిస్తాయని ఓ పరిశోధన సంస్థ పేర్కొంది. ఈ అంశంపై చర్చించడానికి ఆగస్ట్‌లో నాసా ఓ సమావేశాన్ని నిర్వహించనుంది.

అయితే మెదటగా ఈ ప్రోగ్రామ్‌ విజయవంతమవ్వాలంటే రియాక్టర్‌ను డిజైన్‌(రూపకల్పన) చేసి చంద్రుడుపైకి పంపించాలి. మరోవైపు ప్లాంట్‌లను చంద్రుడుపైకి పంపే క్రమంలో ఫ్లైట్‌ సిస్టమ్‌, ల్యాండర్‌ను అభివృద్ధి పరచాలని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రియాక్టర్‌, ల్యాండర్ పూర్తి స్థాయిలో నిర్మించడానికి దాదాపుగా ఐదేళ్లు పట్టవచ్చని నాసా ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా