భారీగా ఉద్యోగాల కోతను విధించనున్న నోకియా

16 Mar, 2021 18:19 IST|Sakshi

ఫిన్‌ల్యాండ్:  ఫిన్నిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగా 600 మిలియన్ యూరోల (715 మిలియన్ డాలర్లు) ఖర్చును తగ్గించేలా 2023 నాటికి 11 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా వచ్చిన  చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ నేతృత్వంలోని  నోకియా తన విస్తృత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాబోయే రెండేళ్ళలో మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఉద్యోగ కోతలు ఉంటాయని తెలపింది..

ప్రణాళికాపరంగానే  ఉద్యోగుల కోతలు

రానున్న  18-24 నెలల వ్యవధిలో  80,000-85,000 ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం నోకియాలో సుమారు 90,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ 5జి పరికరాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంలో తన పోటీదారులైన ఎరిక్సన్, హువాయ్‌లతో జరిగిన రేసులో నోకియా  కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాక గత ఏడాది లో జరిగిన ముఖ్యమైన వెరిజోన్ ఒప్పందాన్ని కోల్పోయి చైనాలోకి అడుగుపెట్టలేకపోయింది.గత ఏడాది ఆగస్టులో లండ్‌మార్క్ అధికారంలోకి వచ్చిన తరువాత, మాజీ సిఈఓ రాజీవ్ సూరి"ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్" వ్యూహాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో మరింత కేంద్రీకృత విధానాన్ని తీసుకొచ్చాడు.
ఆల్కాటెల్-లూసెంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్రాన్స్‌లో 1,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో  సహా, 2018 లో  వ్యయ కోతలో భాగంగా విధించిన ఉద్యోగుల తొలగింపులే  ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు