Qatar Controversial Laws: ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు?

28 Oct, 2023 08:27 IST|Sakshi

ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్‌ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్‌లో అమలయ్యే  వివిధ శిక్షల గురించి  ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్‌ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. 

ఖతార్‌లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్‌లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట.

కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్‌లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో  అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. 
ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు

మరిన్ని వార్తలు