సౌదీ యువరాజు పర్యటనలో పాక్‌ కొనుగోలుకు డీల్‌ ఖరారు?

2 Sep, 2023 07:57 IST|Sakshi

దిగజారుతున్న పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్‌ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్‌ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్‌కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్‌ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్‌లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్‌ కొనుగోలుకు డీల్‌ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి.

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు.  మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పర్యటన ఇస్లామాబాద్‌లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్‌లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్‌ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్  జనరల్ అసిమ్ మునీర్‌లను కలుస్తారని సమాచారం.

క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ని కలవడం వెనుక తన ఇమేజ్‌ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్‌ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్‌ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్‌ ఇస్లామాబాద్‌కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది  ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. 

పాక్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్‌ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్‌ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 
ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు!

మరిన్ని వార్తలు