కొంపముంచిన ‘హాలోవీన్’ మేకప్‌!.. భయంకరంగా మహిళ ముఖం!

5 Nov, 2023 08:56 IST|Sakshi

హాలోవీన్  ఉత్సవాన్ని అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్‌ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనే జనం ఇతరులను భయపెట్టేలాంటి మేకప్ వేసుకుని రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఈ  ఉత్సవం సందర్భంగా ఒక మహిళ తన ముఖంపై వేయించుకున్న భయంకరమైన టాటూ ఆమెను మరింత ఇబ్బందులపాలు చేసింది. 

ఎలిజబెత్ రోజ్ అనే మహిళ  హాలోవీన్ రోజున తాను భయానకంగా కనిపించేందుకు తన ముఖంపై తాత్కాలిక టాటూలు వేయించుకుంది. ఆ మహిళ నుదిటిపైన, నోటిపైన టాటూలు వేయించుకుంది. అయితే ఆ టాటూల గుర్తులు తొలగక పోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురయ్యింది. ఆ మహిళ తన ముఖంపై ఉన్న టాటూను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేసింది. 

‘నేను నా ముఖంపై టాటూ వేయించుకుని హాలోవీన్‌కు వెళ్లాను’ అని రోజ్ ఆ వీడియోలో పేర్కొంది. ఆమె ఆ టాటూను తొలగించడానికి కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించింది. అయినా ఉపయోగం లేకపోయింది. మరుసటి రోజు తనకు ఆఫీసులో మీటింగ్‌ ఉన్న విషయం గుర్తుకువచ్చి ఆమె మరింత ఆందోళనకు గురయ్యింది. అయితే వోడ్కా, యాంటీ బాక్ జెల్, సెల్లోటేప్, ఆలివ్ ఆయిల్, నెయిల్ వార్నిష్ రిమూవర్ మొదలైనవాటిని ఉపయోగించి ఎట్టకేలకు ఆ టాటూ గుర్తులను తొలగించింది.
ఇది కూడా చదవండి: ప్రియుడు ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తే బ్రేకప్‌ చెప్పింది.. ట్విస్ట్‌ ఇదే!

మరిన్ని వార్తలు