phd on pm Modi: మోదీపై పీహెచ్‌డీ.. ముస్లిం మహిళకు డాక్టరేట్‌!

4 Nov, 2023 13:50 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలలో ప్రముఖునిగా గుర్తింపు పొందారు. మోదీని ఆదర్శంగా తీసుకునేవారు మన దేశాలో చాలామంది ఉన్నారు. వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ ప్రధాని మోదీపై డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. ప్రధాని మోదీపై పీహెచ్‌డీ పూర్తి చేసిన తొలి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్ నిలిచారు. ప్రధాని మోదీ రాజకీయ జీవితానికి నజ్మా ప్రభావితురాలయ్యారు.

నజ్మా మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద ‘నరేంద్ర మోదీ రాజకీయ నాయకత్వం - ఒక విశ్లేషణాత్మక అధ్యయనం’ పేరిట 2014లో దీనిని ప్రారంభించానని, 2023 నవంబరు ఒకటి నాటికి ఇది పూర్తయిందని తెలిపారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఈ పరిశోధన పని పూర్తయిందన్నారు.

తన పరిశోధనలో ప్రధానంగా ఐదు అధ్యాయాలు ఉన్నాయన్నారు. అవి అధికారం నుండి విముక్తి, కాంగ్రెస్ వంశ పాలన, ప్రధాని మోదీ రాజకీయ జీవితం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ప్రతిపక్షాల ఆరోపణలు-విమర్శల కాలం, ప్రజలు- మీడియా మద్దతు  అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం తనను అమితంగా ఆకట్టుకున్నదని, దేశానికి జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోదీ కనిపించారని ఆమె తెలిపారు. 
ఇది కూడా చదవండి: ఇంకా ముప్పు తప్పలేదు:నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక!

మరిన్ని వార్తలు