Viral video: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్‌ సంస్థలు కుదేలు

15 Jan, 2022 11:59 IST|Sakshi

Thieves Raid Amazon, FedEx Train Cargo: ఇంతవరకు మనదేశంలో రైళ్లలో దొంగతనాలు గురించి ఉంటాం. అయితే లాంగ్‌ జర్నీ చేసే రైళ్లలో కచ్చితంగా దొంగతనాలు జరుగుతుండటం గురించి విన్నాం. మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌చేసే వస్తువలను తీసుకువచ్చే గూడ్స్‌ రైళ్లపై దొంగలు దాడి చేసి పట్టుకుపోవడం గురించి విని ఉండం. పైగా సరకు కవర్లు కూడా అక్కడే పట్టాలపై గుట్టలు గుట్టలుగా పడేసి వెళ్లిపోతున్నారట.

అసలు విషయంలోకెళ్తే...లాస్ ఏంజిల్స్‌లోని సరకులు రవాణ చేసే రైళ్లపై దొంగలు దాడి చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా  రైళ్లు ఆగే ప్రదేశం కోసం వేచి చూసి డజన్లకొద్ది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే ఉత్పత్తులను ఎత్తుకుపోతారు. అంతేకాదు రైల్వే కంటైనర్ల పై దాడి చేసి కోవిడ్-19 టెస్ట్ కిట్‌లు, ఫర్నీచర్ లేదా మందులు వంటివి చాల ఎత్తుకుపోయారు. ఈ మేరకు శుక్రవారం సిటీ సెంటర్‌కి సమీపంలో ఉన్న పట్టాలపై కొన్ని వేల ఆన్‌లైన్‌ ప్యాకేజ్‌లు పడి ఉ‍ండటాన్ని చూస్తే సమీపంలోని వీధుల నుంచి చాలా సులభంగా రైల్వే కంటైనర్ల వద్దకు చేరకోగలుగుతున్నారని చెప్పవచ్చు ఈ దొంతనాలు గతేడాది యూఎస్‌లో డిసెంబర్‌ నాటికి సుమారు 160% కి చేరితే ఈ ఏడేది ఆ సంఖ్య కాస్త 356%కి చేరింది. ఈ దొంగల ముఠా దెబ్బకు ప్రముఖ ఆన్‌లైన వ్యాపార సంస్థలైన అమెజాన్‌, టార్డెట్‌, యూపీఎస్‌, ఫెడ్‌ఎక్స్‌ వంటి కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి.

అయితే  ఈ దొంగతనాలను అడ్డుకట్టవేయడానికి  డ్రోన్‌లు ఇతర డిటెక్షన్ సిస్టమ్‌లతో సహా -- నిఘా చర్యలను బలోపేతం చేసినట్లు లాస్‌ఏంజెల్స్‌లోని యూనియన్ పసిఫిక్ తెలిపింది . పైగా మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అయితే ఆ దొంగలను పట్టుకున్న తర్వాత కోర్టు చిన్న నేరంగా పరిగణించి ఓ మోస్తారు జరిమాన విధించి వదిలేయడంతో వాళ్లు 24 గంటల్లో విడుదలైపోతున్నారని యూనియన్‌ పసిఫిక్‌ వాపోయింది. పైగా వారు ఈ దోపిడి దాడులు నిర్వహించేటప్పుడు విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం లేదా నిప్పంటించడం వంటి విధ్వంసకర పనులకు తెగబడతున్నారని తెలిపింది. ఈ దొంగతనాలు కారణంగా గతేడాది దాదాపు రూ 36 కోట్ల నష్టం వాటల్లిందని పేర్కొంది. ఈ విషయమై యూనియన్‌ పసిఫిక్‌ లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ అటార్నీ కార్యాలయానికి లేఖ రాయడమే కాక గతేడాది అవలంభించిన భద్రతా విధానాన్ని మళ్లీ పునం పరిశీలించమని కోరింది.

(చదవండి: కరోనాకు 'కత్తెర'.. రెండు కొత్త చికిత్సా విధానాలు ఆమోదం)

మరిన్ని వార్తలు