వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?

6 Nov, 2021 15:07 IST|Sakshi

మసాచుసెట్స్‌: ఎంత పెద్ద స్థలం అయినా మంచిగా అమ్ముడవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బాగా భూములు విలువ తెలిసిన వాళ్లు, రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు మంచి రేటుకు క్రయ విక్రయాలు జరిపించగలరు. అయితే మసాచుసెట్స్‌లోని న్యూటన్ హైలాండ్స్‌లో ఉన్న అతి చిన్న ఇల్లు ఏకంగా  రూ.2.3 కోట్లకు అమ్ముడైంది. అయితే ఈ ఇల్లు అంత ఎక్కువ రేటుకు ఎలా అమ్ముడైంది దీని ప్రత్యేకత ఏంటి అబ్బా  అని ఆలోచిస్తూ తలలు పట్టుకోవద్దు చూద్దాం రండి!

(చదవండి: అమ్మో ఎంత ధైర్యం.. సింహం తోక పట్టుకుని నడుస్తున్నావ్‌!)

ఈ ఇల్లు  కేవలం 250 చదరపు అడుగుల స్థలంలో స్టోర్‌ రూంలా ఉండే ఒక చిన్న అవుట్‌హౌస్. పైగా చుట్టూ గార్డెన్‌లా మొక్కలతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఇళ్లను ఎక్కువగా వ్యాయమశాల గానూ లేదా అవుట్‌ హౌస్‌లా వాడతారు. ఈ మేరకు ఈ ఇల్లు ఇంత అత్యధిక ధరకు అమ్ముడవ్వడానికీ గల కారణం అత్యధునిక టెక్నాలజీ అతి తక్కువ స్థలంలో నిర్మితమైన గృహం కావడం. అంతేకాదు గ్రానైట్ కౌంటర్‌టాప్‌తో కూడిన వంటగది, మంచి లైటింగ్‌ వచ్చేలా ఎలక్ట్రిక్‌ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

పైగా అంత తక్కువ స్థలంలోనే అమరిపోయిలే చుట్టూరా గార్డెన్‌ని ఏర్పాటుచేసుకోనేంతా స్థలం ఉంది. అదీ కాక ఈ ఇల్లు బటన్స్ బోస్టన్‌లోని సంపన్న శివారు ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు ఎ‍ప్పుడూ అత్యధిక రేటులో ఉండటం వల్లే ఈ ఇల్లు అత్యధిక దరకు అ‍్మముడైంది.

(చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!)

మరిన్ని వార్తలు