పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత 

16 May, 2022 07:42 IST|Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్‌ సింగ్‌(42), రంజీత్‌ సింగ్‌(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్‌లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. 
చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా

మరిన్ని వార్తలు