ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో మలుపు.. రష్యా బలగాలకు తోడైన రెబల్స్‌

3 Mar, 2022 14:10 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధం ఎనిమిదవ రోజు పరిణామాలు రష్యాకు పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. ప్రధాన పట్టణాలపై పట్టు సాధించే క్రమంలో విజయవంతం అవుతున్న పుతిన్‌ సేన.. పెనువిధ్వంసంతో దూసుకుపోతోంది. రష్యా రక్షణ శాఖ కథనాల ప్రకారం.. ఉక్రెయిన్‌ ప్రధాన పట్టణాల్లో 70 శాతంపైగా రష్యా స్వాధీనంలోకి వచ్చేశాయి. ఒకవైపు భూభాగం, మరోవైపు గగనతలం.. ఈ ఉదయం నుంచి పోర్ట్‌ ఏరియాల్లోనూ దాడులను ఉధృతం చేసేసింది. ఇదిలా ఉండగా.. 

మరియూపోల్‌ నగరంలో రష్యా బలగాల స్థానే ఉక్రెయిన్‌ డోనెట్‌స్క్ రెబల్స్‌ సైన్యం, ఉక్రెయిన్‌ సైన్యంతో పోరాటం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ పోరులో రష్యా సైన్యానికి బెలారస్‌ తోడవుతుందని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. బెలారస్‌ కంటే ముందే ఉక్రెయిన్‌ రెబల్స్‌ ఆర్మీ రష్యాకు పూర్తిస్థాయి మద్ధతుతో దిగింది. ఉక్రెయిన్‌ రష్యా హస్తగతం అయ్యేదాకా పోరు ఆపమని ఈ సందర్భంగా డోనెట్‌స్క్ ఆర్మీ ఛీఫ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు