ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి

7 Nov, 2023 06:12 IST|Sakshi

19 మంది ఉక్రెయిన్‌ జవాన్లు మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్‌ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్‌–అసాల్ట్‌ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు