యూఎన్‌ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్‌

9 Jun, 2021 08:17 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్‌ భద్రతా మండలి సిఫారసు చేసింది.  యూఎన్‌ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియాకే అవకాశం ఇవ్వాలని మంగళవారం జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.

గుటెరస్‌ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా రెండోసారి... 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్‌ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్‌  భద్రతామండలి  తీర్మానాన్ని స్వాగతించింది.

(చదవండి: గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష  )

మరిన్ని వార్తలు