భారత విద్యార్థులకు అమెరికా ప్రత్యేక కోర్సుల రూపకల్పన..

16 Aug, 2023 20:59 IST|Sakshi

న్యూయార్క్‌: మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమెరికా కూడా భారతీయ విద్యార్థులకు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు. 

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారిక విభాగం వెల్లడించింది. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. పనిలో అనుభవం తెచ్చుకోవడంతో పాటు స్టుడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి వీలవుతుంది. 

అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. భారతదేశం 2020లో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యా విధానాలను రూపొందించారు. 

ఇదీ చదవండి: Viral: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..

మరిన్ని వార్తలు