Delta Variant: ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. ఒక్క రోజులో వెయ్యికి పైగా మరణాలు

19 Aug, 2021 18:39 IST|Sakshi

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. వాయు వేగంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ వల్ల దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపిస్తుంది. గడిచిన నెల రోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, ఒక్క రోజులోనే వెయ్యికి పైగా(1017) మరణాలు నమోదైనట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

దీంతో అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,23,000లకు చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కరోనా మరణాలు సంభవించలేదు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో గణణీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో కరోనా హాస్పిటలైజేషన్లలో 70శాతం పెరుగుదల కనిపించిందని స్థానిక వార్తా సంస్థ తమ వివేదికలో పేర్కొంది.
చదవండి: Afghanistan: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్‌ ఖాన్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు