గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

20 Sep, 2021 15:02 IST|Sakshi

వాషింగ్టన్‌: స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏం బంధమైన సరే కలకాలం నిలవాలంటే.. నమ్మకం అనే బలమైన పునాది అవసరం. అనుమానం ఉంటే ఆ బంధం త్వరగా ముగిసిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రేమలో అనుమానం ఉంటే.. అది మధ్యలోనే తెగిపోతుంది. ఏ రిలేషన్‌ అయినా సరే ఎదుటివారికి తగిన స్పేస్‌ ఇవ్వడం వల్ల ఆ బంధం మరింత బలపడుతుంది. లేదంటే అర్థాంతరంగా ముగుస్తుంది. ఇదే అనుభవం ఎదురయ్యింది అమెరికా యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని కరోలిన్‌కి. ఆమె బాయ్‌ఫ్రెండ్ తమ రిలేషన్‌ కొనసాగాలంటే.. కరోలిన్‌ 11 నియమాలను తప్పకుండా పాటించాలని తెలిపాడట. 
(చదవండి: ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్‌ఫ్రెండ్‌)

తన బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన నియమాల నోట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్‌. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్‌ 'కంట్రోలింగ్' స్వభావం గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్‌ అవుతుంది. కరోలిన్‌ బాయ్‌ఫ్రెండ్‌ విధించిన నిబంధనల ప్రకారం ఆమె బయట తినడం, తాగడం, బిగుతు దుస్తులు ధరించడం నిషేధం. వీటితో పాటు ఆమె ఆల్కహాల్‌ కూడా తీసుకోకూడదు.
(చదవండి: ఒక్కడి కోసం ఇద్దరు యువతుల ఫైట్‌.. జుట్టు పట్టుకొని!)

ఇవేకాక కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ ఆమెను అబ్బాయిలతో కలవకుండా నిషేధించాడు. అతను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తీసివేయకూడదని తెలిపాడు. అంతేకాక కరోలిన్ రాత్రి 9 గంటలకు తన హాస్టల్ గదికి తిరిగి రావాలని సూచించాడు. అలానే క్రాప్ టాప్, టైట్ డ్రెస్ ధరించడం.. పార్టీలకు హాజరు కావడానికి కూడా ఆమెకు అనుమతి లేదు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ చేసిన నియమాలను రోజూ ఆమె పాటించాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసిన కరోలిన్‌.. అతడితో బంధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఆమె నిర్ణయంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: 8 ఏళ్లుగా డేటింగ్‌, పెళ్లి కావాలంటూ కోర్టుకు..

మరిన్ని వార్తలు