వైరల్‌: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి

2 Mar, 2021 16:57 IST|Sakshi
తనని తానే పెళ్లి చేసుకున్న మెగ్‌ టేలర్‌ మోరిసన్

వైరలవుతోన్న అమెరికా అట్లాంటా యువతి వివాహ వేడుక

వాషింగ్టన్‌ : వివాహం అంటే స్త్రీ, పురుషలు మధ్య జరిగే వేడుక. అయితే ఈ మధ్య కాలంలో సేమ్‌ సెక్స్‌ వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు తప్పని సరి. కానీ కొన్ని నెలల కిత్రం ఓ వ్యక్తి తనను తానే పెళ్లి చేసుకున్న సంఘటన గురించి ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి తనను తానే వివాహం చేసుకుంది. ఇందుకు ఆమె ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది. తన సంతోషం కోసం తనను తానే వివాహం చేసుకున్నానని వెల్లడించింది అమెరికా అట్లాంటాకు చెందిన మెగ్‌ టేలర్‌ మోరిసన్‌. 

ఈ సందర్భంగా మెగ్‌ మాట్లాడుతూ.. ‘‘అందరి ఆడపిల్లలాగే నేను మంచి వ్యక్తిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనుకున్నాను. కానీ అన్ని మనం అనుకున్నట్లే జరగవు కదా. నేను, నా బాయ్‌ఫ్రెండ్‌ గతేడాది జూన్‌లో విడిపోయాం. బ్రేకప్‌ నన్ను కుంగదీసింది. చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. లవ్‌ ఫెయిల్యూర్‌‌ అయినంత మాత్రాన నేను నా కలల్ని, సంతోషాలని ఎందుకు చంపుకోవాలి అని అనిపించింది. అలా అని మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనిపించలేదు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని తెలిపింది మెగ్‌.

ఇక వివాహం కోసం సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంది మెగ్‌. కస్టమ్ మేడ్ కేక్, డ్రెస్‌ను ఆమె ఆర్డర్ చేసింది. పెళ్లి కోసం ప్రత్యేకంగా ఒక డైమండ్ రింగ్ కూడా కొనుగోలు చేసింది. వివాహ వేడుకలో ఉంగరం పెట్టుకొని, అద్దంలో తన రూపాన్ని ముద్దు పెట్టుకుంది. తన సొంత లక్ష్యాలు, కోరికల కోసం పాటుపడతానని పెళ్లిలో ప్రమాణం చేసింది. తన ఆలోచనల ప్రకారమే నడచుకుంటానని చెప్పింది. ఇలా అన్ని పెళ్లి తంతులను ఒక్కతే పూర్తి చేసింది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగ్‌కు సన్నిహితంగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు..  పెళ్లి కోసం మెగ్ 1,000 పౌండ్లు (రూ.1.02 లక్షలు) ఖర్చు చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. 

మరో పెళ్లికి సిద్ధం
మంచి వ్యక్తి దొరికితే రిలేషన్‌షిప్‌లో ఉండటానికి తనకు అభ్యంతరాలు లేవన్నది మెగ్‌. అతడిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ప్రకటించింది. ‘పెళ్లి సందర్భంగా నాకు నేనొక వాగ్దానం చేసుకున్నాను. నా మ్యారేజ్ రింగ్‌ను చూసిన ప్రతిసారీ నా కోసం నేను పెళ్లి చేసుకున్నాననే విషయం గుర్తొస్తోంది. పెళ్లి నా జీవితాన్ని ప్రశాంతంగా, అందంగా తీర్చిదిద్దింది’ అన్నది మెడ్‌. కరోనా మహమ్మారి కారణంగా హనీమూన్‌కు వెళ్లలేదని చెప్పింది. కోవిడ్‌ ముగిసిన తరువాత హనీమూన్‌కు వెళ్లి ప్రశాంతంగా గడుపుతానని వివరించింది.

చదవండి:
బ్రేక‌ప్‌: త‌న‌ను తానే పెళ్లి చేసుకున్నాడు
సింగిల్‌ లైఫే బాగుంది: ష్రాఫ్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు