ఏం సార్‌.. గోక్కోవడం కూడా తప్పేనా..  

8 Sep, 2022 09:35 IST|Sakshi

మనుషులకు దురదేస్తే ఏం జరుగుతుంది.. ఏమీ జరగదు.. గోక్కుంటారు అంతే.. మరి ఏనుగుకు దురదేస్తే ఏం జరుగుతుంది? ఏదో ఒకదానికి మూడుతుంది. ఇక్కడ వంతు ఈ కారుది. ఎక్కడ జరిగిందన్న విషయం తెలియనప్పటికీ.. దీన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేస్తే.. జనం తెగ చూశారు.

చూడటమే కాదు.. తెగ నవ్వుకున్నారు కూడా.. మీరే ఏనుగై.. మీకు దురదేస్తే ఏం చేస్తారు? అన్న క్యాప్షన్‌తో దీన్ని షేర్‌ చేయడంతో రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెట్టారు. గజరాజు ఈ కారును టాయిలెట్‌ పేపర్‌ కింద వాడుకున్నట్లు ఉంది అని ఒకరు వ్యాఖ్యానించారు. గోక్కోవడం తప్ప.. దాడిలాంటిది ఏనుగు చేయకపోవడంతో ఆ సమయంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.   

మరిన్ని వార్తలు