భావోద్వేగ క్షణం: 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమ్మగొంతు విని....

6 Nov, 2022 16:30 IST|Sakshi

ఒక్కక్షణం నిశబ్దం చాలా భరించలేని విధంగా ఉంటుంది. అలాగని గందరగోళంగా ఉన్నా భరించలేం. కానీ కొంతమంది పుట్టుకతో వినపడని వాళ్లు ఉంటారు. వాళ్లు ఆ నిశబ్దాన్నిఎలా భరించగలుగుతారో తెలియదు. ఆ నిశబ్దం కారణంగా వారు ఏమి గ్రహించలేక మాటలు కూడా నేర్చుకోవడం అసాధ్యంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి చిన్నప్పుడే ఒక ఆరోగ్య సమస్యతో వినికిడి శక్తిని కోల్పోయాడు. అలాంటి వ్యక్తి తొలిసారిగా తన తల్లి గొం‍తు వినగానే ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. 

వివరాల్లోకెళ్తే...ఎడ్వర్డో అనే వ్యక్తి మెనింజైటిస్‌ అనే వ్యాధి కారణంగా వినకిడి శక్తిని కోల్పోయాడు. దీంతో అతను దశాబ్దాలుగా నిశబ్దంలోనే గడిపాడు. ఎట్టకేలకు నిశబ్దాన్ని చీల్చుకుని ఒక చిన్న మైనర్‌ సర్జరీ తదనంతరం తొలిసారిగా తల్లి గొంతును విన్నాడు. 35 ఏళ్ల నిశబ్ద అనంతరం తొలిసారిగా తన అమ్మ గొంతు విని ఒక్కసారిగా భావోద్వేగంతో కళ్లు చెమ్మగిల్లాయి.

ఈ మేరకు ఎడ్వర్డో తల్లి తన పక్కనే కూర్చిని పదేపదే తన కొడుకును పేరుతో పిలిస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉ‍న్న మిగతా బంధువులంతా ఆ అద్భుత క్షణాన్ని చూస్తూ భావోద్వేగం చెందారు. సదరు వ్యక్తి తన చెవులు వినిపిస్తున్నందుకు ఆనందంతో తన కూతురు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎడ్వర్డో అమ్మ మీతో మాట్లాడుతోందని ఒకరు, ఇది హార్ట్‌ టచ్‌ చేసే ఘటన అని మరోకరు రకరకాలుగా కామెంట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

A post shared by Good News Movement (@goodnews_movement)

(చదవండి:  ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్‌...)

మరిన్ని వార్తలు