ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జెండాలపై యూనియన్‌ జాక్‌ ఎందుకు?

2 Nov, 2023 11:23 IST|Sakshi

ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత జాతీయ జెండా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఇతర దేశాల జెండాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ జెండాలలో ఓ ప్రత్యేకత ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలకు ఒక మూలన బ్రిటిష్ జెండా కనిపిస్తుంది. ఈ విధంగా ఏ దేశ జాతీయ జెండా కూడా ఉండదు. మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఎందుకు ఇలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జెండాల మూలన యూనియన్ జాక్  ఎందుకు కనిపిస్తుందంటే..ఈ రెండు దేశాలు బ్రిటిష్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఇవి బ్రిటిష్ కామన్వెల్త్ దేశంలో భాగంగా ఉన్నాయి. యూనియన్ జాక్ దీనికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. యూనియన్ జాక్ అనేది న్యూజిలాండ్ చారిత్రక పునాదిని గుర్తిస్తుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ జెండాలో ఆరు తెల్లని నక్షత్రాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జెండాలో నాలుగు ఎరుపు నక్షత్రాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని యూనియన్ జాక్‌ను మొదటిసారిగా 1770, ఏప్రిల్‌ 29న కెప్టెన్ కుక్ స్టింగ్రే హార్బర్‌లో ఎగురవేశారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలు బ్రిటన్‌ను పోలివుంటాయి. 
ఇది కూడా చదవండి: చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది?

మరిన్ని వార్తలు