Meg Lanning Retirement: ఆస్ట్రేలియా కెప్టెన్‌ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌

9 Nov, 2023 08:24 IST|Sakshi

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు సారధి మెగ్‌ లాన్నింగ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్‌ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొంది. 31 ఏళ్ల లాన్నింగ్‌ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

లాన్నింగ్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించి, 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఫుల్‌టైమ్‌ బ్యాటర్‌, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన లాన్నింగ్‌ తన కెరీర్‌లో 17 సెంచరీలు, 38 హాఫ్‌ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది. లాన్నింగ్‌ తన కెరీర్‌లో ఏడు వరల్డ్‌కప్‌ టైటిళ్లలో భాగమైంది. లాన్నింగ్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించింది. 

మరిన్ని వార్తలు