భర్తకి విడాకులిచ్చి.. కుక్కతో పెళ్లి.. తరువాత మహిళ చెప్పింది వింటే మైండ్‌ బ్లాక్‌!

25 Nov, 2021 13:23 IST|Sakshi

కొన్ని సార్లు మన చూట్లు జరిగేవి పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో కొన్నింటిని అయితే నమ్మలేము కూడా. తాజాగా అలాంటి ఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన అమండా రోడ్జర్స్ (47) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగానే జీవితాన్ని గడిపింది. అయితే ఇటీవల అమండా తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది. ఆ కుక్క పేరుషెబా. ఆమండా ఆ కుక్కని రెండు నెలల వయస్సు ఉన్నప్పటి నుంచి పెంచుతోంది.

అప్పటి నుంచి షెబా తనపై ఎంతో ప్రేమని చూపిస్తోందని తెలిపింది. అందుకే మనుషులు చూపించే ప్రేమకంటే తన షెబాలోనే నిజమైన ప్రేమను చూశానని అందుకే దాన్నే భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంది అమండా. అందుకు తాను మోకాళ్లపై నిలబడి షెబాకు ప్రపోజ్ చేయగా అది తోక ఊపి తన అంగీకారం తెలిపినట్లు చెప్పింది. ఆ తర్వాత అమండా తన పెంపుడు కుక్క షెబాను 200 మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అమండా ఇప్పటి వరకు షెబాతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఆమె చుట్టు పక్కల వారికి అమండా, షెబా మధ్య ప్రేమ వింతగా అనిపించినా.. అమండా అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలపడంతో అటువంటి వారికి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా సమాధనం చెప్పింది.

చదవండి: స్క్విడ్‌ గేమ్‌ చూశాడని తుపాకులతో కాల్చి చంపి, ఆపై విద్యార్థులను..

మరిన్ని వార్తలు