Burj Al Arab Jumeirah: ప్రపంచంలో ఏకైక 10 స్టార్‌ హోటల్‌ ఎక్కడుంది?

14 Jan, 2024 10:54 IST|Sakshi

బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక టెన్‌ స్టార్ హోటల్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉంది. ఇది ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన హోటళ్లలో ఒకటి. అయితే దాని ఎత్తులో 39 శాతం నివాసయోగ్యం కాదు.

బుర్జ్ అల్ అరబ్ 1999 సంవత్సరంలో నిర్మితమయ్యింది. దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు (రూ. 8330 కోట్లు)కు మించి ఖర్చయింది. ఈ కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్‌కు 280 మీటర్లు (920 అడుగులు) దూరంలో ఉంది.

బుర్జ్ అల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది. దీనిని ఓడకు గల తెరచాపను పోలివుండేలా నిర్మించారు. దీని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది భూమి నుండి 210 మీటర్లు (689 అడుగులు) ఎత్తులో ఉంది.బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో రోజువారీ గది ధర రూ. రూ. 2,58,679 నుండి రూ. 1,055,372 వరకు ఉంది.

సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా  రోల్స్ రాయిస్ ద్వారా హోటల్‌కు చేరుకోవచ్చు. దీనిలోని అన్ని సూట్‌లలో అరేబియా గల్ఫ్  అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి. ఈ సూట్‌లలో ఉచిత వైఫై, వైడ్ స్క్రీన్ ఇంటరాక్టివ్ హెచ్‌డీ టీవీ, రియాక్టర్ స్పీకర్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు, ఒక స్పా, పలు సీ వ్యూ గదులు ఉన్నాయి. అలాగే రూఫ్‌టాప్ బార్, రెండు స్విమ్మింగ్ పూల్స్, 32 గ్రాండ్ కాబానాస్, ఒక రెస్టారెంట్ ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు