రైల్వేస్టేషన్‌కు కొంగొత్త హంగులు

1 Mar, 2023 02:04 IST|Sakshi
రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న డీఆర్‌ఎం

జనగామ: జనగామ రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారిపోనున్నాయి. మొదటి, రెండో ఫ్లాట్‌ ఫాంల అభివృద్ధితో పాటు ప్రయాణికులు వచ్చి పోయేందుకు కొత్త దారులను ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) అభయ్‌ కుమార్‌ గుప్తా జనగామ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. బుకింగ్‌ కౌంటర్‌, ప్రయాణ ప్రాంగణం, పోలీస్‌స్టేషన్‌, సిగ్నలింగ్‌, టాయిలెట్స్‌, పారిశుద్ధ్యం, రెండు ఫ్లాట్‌ ఫాంలపై సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించారు. గంట పాటు రైల్వేస్టేషన్‌లోనే ఉండి... కొత్తగా చేపట్టబోయే పనులతో పాటు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూశారు. రైల్వే ఆస్తులపై అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడారు. స్టేషన్‌ ఆవరణలో చిన్న పాటి నిర్మాణం చేయగా, అనుమతులు లేకుండా ఎందుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆయన వంట డీఓఎం మనోజ్‌, డీసీఎం సీని యర్‌ అసిస్టెంటు బస్వరాజ్‌, కృష్ణారెడ్డి, జనగామ స్టేషన్‌ అధికారులు శ్రీహరి, లక్ష్మణ్‌ ప్రసాద్‌, సురేష్‌ తదితరులు ఉన్నారు. కాగా జనగామ స్టేషన్‌లో శా తవాహన, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లను ఆపాలని ప్ర యాణికులు, పలు పార్టీల నాయకులు ఎండీ అజ హరొద్దీన్‌, మహంకాళి హరిశ్చంద్రగుప్త, లగిశెట్టి వీరలింగం డీఆర్‌ఎంకు విన్నవించారు.

కొత్తగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి

స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

అభయ్‌కుమార్‌ గుప్తా

మరిన్ని వార్తలు