58కిలోల ఎండు గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

58కిలోల ఎండు గంజాయి స్వాధీనం

Published Sat, Nov 18 2023 1:46 AM

బహుమతులు అందుకుంటున్న విద్యార్థినులు - Sakshi

విలువ రూ.14,50,000

మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తా వద్ద టాస్క్‌ఫోర్స్‌, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ కాజీపేట, మడికొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అల్తాఫ్‌ అమీన్‌ ఖాన్‌(26), ఒడిశా రాష్ట్రానికి చెందిన తపన్‌ పాణి (47) సులభంగా డబ్బులు సంపాదించడానికి ఒడిశా సరిహద్దు నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఎండు గంజాయి కిలో రూ.5వేలకు కొనుగొలు చేసి హైదరాబాద్‌కు తరలించి అక్కడ కిలో గంజాయి రూ.25వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో గంజాయితో కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైలు దిగి బస్సులో వెళ్లేందుకు బస్సు స్టాప్‌ వద్దకు వెళ్లగా అక్కడ పోలీసులు ఉండడంతో మడికొండ సెంటర్‌ వద్ద బస్సు ఎక్కడానికి వచ్చారు. దీంతో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురిని పోలీసులు తనిఖీ చేసి గంజాయిని సీజ్‌ చేసి సుమారు రూ.14,50,000 లక్షల విలువ చేసే 58 కిలోల ఎండు గంజాయిని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మడికొండ ఎస్‌హెచ్‌ఓ వేణు, ఎస్సై రాజబాబు, ఏఎస్సై చంద్రమౌళి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకృతి రక్షణ అందరి బాధ్యత

జనగామ రూరల్‌: ప్రకృతిని రక్షించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అండ్‌ గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌, తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ‘మానవ జీవన విధానంలో ప్రకృతి ప్రాత’ అనే అంశంపై చేపట్టిన ఈ పోటీల్లో 8, 9 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మకంచ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.ఐశ్వర్య ప్రథమ బహుమతి రూ.3,000, వావిలాల జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని వైష్ణవి ద్వితీయ బహుమతి రూ.2000, ఖిలాషాపురానికి చెందిన కిరణ్మయి తృతీయ బహుమతి రూ.1000 అందుకున్నారు. కార్యక్రమంలో తోట రాజు, రమేష్‌, గౌసియాబేగం, కనకయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement