కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పరిశీలించిన కడియం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పరిశీలించిన కడియం

Published Sat, Nov 18 2023 1:46 AM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండల పరిధి ఛాగల్లు శివారు శివారెడ్డిపల్లి వద్ద ఈనెల 20న నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సీఎం సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే అన్ని మండలాల్లో పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించామన్నారు. సభకు దాదాపు లక్షమంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, పోగుల సారంగపాణి, తాటికొండ సురేష్‌, కనకం రమేష్‌, కనకం గణేష్‌, రాపోలు మధుసూదన్‌రెడ్డి, తోట సత్యం ఉన్నారు.

అధిక సాంద్రత పద్ధతితో సుస్థిర దిగుబడి

రఘునాథపల్లి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల సుస్థిర దిగుబడి పొందవచ్చని యాదాద్రి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధి రామన్నగూడెంలో ఏరువాక కేంద్రం యాదాద్రి, కేంద్ర పత్తి పరిశోధన సంస్థ నాగ్‌పూ ర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడారు. అధిక సాంద్రత పత్తి సాగులో గులాబీ రంగు పురుగు, కాయ తొలుచు పురుగు ఉధృతి తగ్గుతుందన్నారు. రెండవ పంటగా సాగు చేసే ఈ విధానంలో ఒకేసారి పూత, కాత వచ్చి పంట తొందరగా చేతికి అంది పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందని చెప్పారు. ఈ పథకం కింద పెట్టుబడిలో భాగంగా పురుగు మందుల పిచికారీకి రైతుల బ్యాంకు ఖాతాల్లో కొంత నగదు జమ చేస్తారని అన్నారు. లాభదాయకంగా ఉండే ఈ విధానంలో పత్తి సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. సదస్సులో శాస్త్రవేత్త మధుశేఖర్‌, మండల వ్యవసాయాధికారి కాకి శ్రీనివాస్‌రెడ్డి, రాశి విత్తనాల సంస్థ మేనేజర్‌ రాజిరెడ్డి, దేశ్‌పాండే ఫౌండేషన్‌ ప్రతిని ధులు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌, అభ్యుదయ రైతులు రామకృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో

వసతులు కల్పించాలి

నర్మెట: పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా మార్కెటింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నరేందర్‌ అన్నారు. మండల పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయన శుక్రవారం అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌ తదితర వసతుల ను కల్పించాలని కార్యదర్శులకు, బీఎల్‌ఓలకు సూచించారు. ఆయన వెంట పీఆర్‌ఏఈ గురిజా ల ప్రదీప్‌, కార్యదర్శి కందకట్ల శ్రీధర్‌, బీఎల్‌ఓలు చిర్ర వెంకట్‌రెడ్డి, ప్రజ్ఞాపురం స్వేత తదితరులు ఉన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

చిల్పూరు: పాట్నాలో డిసెంబర్‌ 24 నుంచి జరిగే జాతీయ స్థాయి షూటింగ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ పోటీలకు మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన వరికుప్పల మహేష్‌, మల్కాపూర్‌ కు చెందిన కనుకం జాయ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల పీఈటీ, షూటింగ్‌ బాల్‌ అసో సియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్‌, మల్కాపూర్‌ జ్యోతి నికేతన్‌ ప్రిన్సిపాల్‌ మేరీజెస్‌, పీఈటీ అజయ్‌ శుక్రవారం వెల్లడించా రు. ఈనెల 5న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. వారిని జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి, సర్పంచ్‌లు రవి, మారేపల్లి తిరుమల, ఎంపీటీసీలు మారేపల్లి లలితదేవి, సుధాకర్‌ అభినందించారు.

1/3

2/3

కనుకం జాయ్‌
3/3

కనుకం జాయ్‌

Advertisement
Advertisement