జీజీహెచ్‌లో శిశువు మృతి | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో శిశువు మృతి

Published Thu, Nov 9 2023 12:40 AM

-

● వైద్యులతో కుటుంబ సభ్యులు, బంధువుల వాగ్వాదం

కోల్‌సిటీ(రామగుండం): ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు జీజీహెచ్‌ ఆస్పత్రిలో ఆందోళన నిర్వహించారు. రామగుండంకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి ఈనెల 1న గోదావరిఖనిలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో చేరగా 3న వైద్యులు డిశ్చార్జి చేశారు. మళ్లీ 5న మరోసారి చెకప్‌ కోసం రాగా పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపించారు. ఈనెల 9న డెలివరీ చేస్తామని వైద్యులు తెలపగా బుధవారం ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చింది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో శిశువు మృతిచెందిందని తెలిపారు. అనంతరం ఆపరేషన్‌ చేసి శిశువును బయటకు తీశారు. అయితే ఈనెల 5న బెడ్లు ఖాళీగా లేవంటూ నిర్లక్ష్యంగా ఇంటికి పంపించారని, అప్పుడే అడ్మిట్‌ చేసుకొని వైద్యం అందిస్తే శిశువు చనిపోయేది కాదని, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసిన వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు బాధితులతో మాట్లాడారు. ఈ విషయమై ఆర్‌ఎంవో అరుణను వివరణ కోరగా ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు.

చికిత్స పొందుతూ

వేములకుర్తి యువకుడు..

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని వేములకుర్తిలో మూడురోజుల క్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన హనుమంతరావు (20) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల తెలిపిని వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన హనుమంతరావు భార్య కళావతితో కలిసి ఆరునెలలుగా వేములకుర్తిలోని కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఈనెల 4న ఇద్దరి మధ్య గొడవ జరగగా కళావతి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన హనుమంతరావు పురుగుల మందుతాగాడు. గమనించిన తోటి కూలీలు మెట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement