ఈ బస్సు మహిళా మిత్ర

28 Aug, 2020 08:21 IST|Sakshi

బెంగళూరు : కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఓ బస్సును అన్ని సదుపాయాలతో మహిళల టాయ్‌లెట్‌గా రూపొందించారు. అంతేకాదు ఇందులో శిశువులకు పాలిచ్చే గది, శానిటరి న్యాప్కిన్‌ వెండింగ్‌ మిషన్, బిడ్డ డైపర్‌ మార్చే స్థలం, సోలార్‌ దీపాలతో బహుళ ప్రయోజన బస్సుగా మార్చారు. ఇందుకు రూ.12 లక్షలు వ్యయమైంది. గురువారం డీసీఎం లక్ష్మణ సవది ప్రారంభించారు. బస్సును నగరంలో రద్దీ కూడళ్లలో మహిళల కోసం నిలిపి ఉంచుతారు.

   

మరిన్ని వార్తలు