బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం.. ఇద్దరు మహిళల మృతి

11 Nov, 2023 21:01 IST|Sakshi

ఆగ్రాలోని బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం రేగింది. శుక్రవారం (నవంబర్‌ 10) రాత్రి ఇద్దరు మహిళలు (సిస్టర్స్‌) మృతి చెందారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల దగ్గర సూసైడ్‌ నోట్స్‌ లభ్యమయ్యాయి. ఆశ్రమానికి చెందిన నలుగురు సిబ్బంది పేర్లు అందులో ఉన్నాయి. వారే తమ చావుకు కారణమని మృతులు పేర్కొన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన ఇద్దరు మహిళలకు, వారి బంధువులకు మధ్య విభేదాలు ఉన్నాయి. వారు బ్రహ్మ కుమారి సంస్థ నుంచి రూ. 25 లక్షలతో పారిపోయి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న మరొక ఆశ్రమానికి వెళ్లారు.

బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఇద్దరు మహిళలు చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఖేరాఘర్‌ ఏసీపీ మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఆ మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని, మృతుల దగ్గర సూసైడ్‌ నోట్లు లభ్యమయ్యాయని చెప్పారు. మృతుల దగ్గర నుంచి సూసైడ్‌ నోట్లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు