జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో.. శ్రీశైలం జలాశయంలో

7 Nov, 2023 10:07 IST|Sakshi

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2,800క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. నెట్టెంపాడు ఎత్తిపోతల నీటి పంపింగ్‌ కొనసాగుతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 99, ఎడమ కాల్వకు 1,140, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్‌ లింకు కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగులు
దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో సోమవారం 842 అడుగుల వద్ద 64.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,392, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 960, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 135 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.

మరిన్ని వార్తలు