నవంబర్‌ 10 నాటికి జిల్లాలో మహబూబ్‌ నగర్‌ | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 10 నాటికి జిల్లాలో మహబూబ్‌ నగర్‌

Published Thu, Nov 16 2023 1:30 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌, ఎస్పీ హర్షవర్ధన్‌  - Sakshi

● నవంబర్‌ 10 నాటికి జిల్లాలో మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,52,318 మంది ఓటర్లు, జడ్చర్ల నియోజకవర్గంలో 2,20,233 మంది, దేవరకద్ర నియోజకవర్గంలో 2,35,147 మంది మొత్తం 7,07,698 మంది ఓటర్లు ఉన్నారని, వీరికి అదనంగా 780 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే జిల్లాలో మూడు నియోజకవర్గాలలో కలిపి 12,931 మంది దివ్యాంగ ఓటర్లు, 18 ఏళ్ల వయసున్న ఓటర్లు 24,380 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 6,788 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎవరైనా దివ్యంగ ఓటర్లు ఓటు వేయలేని పక్షంలో సాక్ష్యం యాప్‌ ద్వారా వారికి వీల్‌ చైర్స్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 835 పోలింగ్‌ కేంద్రాల్లోని సగం కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించేందుకు చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు బుధవారం నుంచి 25 వరకు ఓటర్లకు అందజేయడం జరుగుతుందని, అయితే ఈ స్లిప్పులు కేవలం ఓటు హక్కును తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయన్నారు. ఓటర్లు ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి ఓటు వేయాలని కోరారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తామన్నారు.ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 16 మంది నోడల్‌ అధికారులను నియమించామని, 93 సెక్టోరల్‌ అధికారులను, 9 ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 11 ఎస్‌ఎస్‌టీ బృందాలు, 3 వీఎస్టీ, 3 వీవీటీ బృందాలు, 3 సహాయక వ్యయ పరిశీలకులు, 17 ఎంసీసీ బృందాలు, ఒక ఎంసీఎంసీ, జిల్లాస్థాయిలో ఎన్నికల వ్యయ నిర్వహణకు సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఐదు అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సువిధ ఆప్‌ ద్వారా సింగిల్‌ విండో పద్ధతిలో అన్ని రకాల అనుమతులను ఇస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement