ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్‌ బుక్‌లో రాసి..

7 Nov, 2023 10:04 IST|Sakshi
సంధ్య (ఫైల్‌)

సాక్షి, మెదక్‌/తూప్రాన్‌: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్‌ పరిధిలోని బ్రహ్మణపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మణపల్లికి చెందిన శివసాయికి ఆరేళ్ల కిందట మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన సంధ్య(25)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని నెలల కిందట శివసాయికి రోడ్డుప్రమాదం జరగడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు.

దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలోనే సంధ్య అనారోగ్యానికి గురై తీవ్ర మనస్థాపానికి లోనైంది. సోమవారం తన ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నా’ అని నోట్‌ బుక్‌లో రాసి చనిపోయిందని ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. తల్లి మృతిచెందడంతో ఇద్దరు కుమారులను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు