ఆసక్తికరంగా ‘14’ మూవీ టీజర్‌

14 Oct, 2021 15:04 IST|Sakshi

శ్రీ విష్ణు చేతుల మీదుగా  ‘14’ మూవీ టీజర్‌ విడుదల

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని  కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగార్, రతన్,జబర్దస్త్ మహేష్ నటీ,నటులుగా లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో  సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న ‘14’.ఈ చిత్రం టీజర్‌ను తాజాగా యంగ్‌ హీరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నోయల్ కు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో  ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం .నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు  వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఈ సినిమా నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు 

శ్రీవిష్ణు మా  చిత్రానికి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.తన ద్వారా మా చిత్రానికి మంచి బూస్టప్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తో చేసే అవకాశం వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను’అన్నాడు హీరో నోయల్‌. 

మరిన్ని వార్తలు