జోష్‌ మీదున్న హీరో ఆది..మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌

22 Mar, 2021 17:47 IST|Sakshi

హీరో ఆది సాయికుమార్‌, ఇటీవలె నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినమా ఇటీవలె విడుదలయ్యింది. ఇప్పుడు ఆది మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్తో , స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.  శిఖర  క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా  గుడివాడ యుగంధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


సాకేత్  కొమండూరి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఇక దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే మాటలను  భాస్కర్ బంటు పల్లి  అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఉగాది సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

చదవండి : ‘శశి’ టీంకు భారీ షాక్‌.. విడులైన తొలి రోజే..
అర్థరాత్రి షూటింగ్‌లో గాయపడ్డ నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు