ఆది సాయికుమార్‌కు భారీ షాక్‌.. ‘శశి’విడులైన తొలి రోజే..

20 Mar, 2021 14:47 IST|Sakshi

హీరో ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మార్చి 19న (శుక్రవారం) ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా గత వారం మార్చి 12న విడుదలైన జాతిరత్నాలు మూవీకి షాక్‌నిస్తూ విడుదలైన తొలి రోజే పైరసి భూతం తాకింది. అయినప్పటికి బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్‌ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈసారి ‘శశీ’ మూవీకి కూడా భారీ షాక్‌ తగిలింది.

విడుదలైన మొదటి రోజే ఈ మూవీ పైరసీ బారిన పడింది. ఇక ఈ మూవీతో పాటు ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’ సినిమాలు కూడా విడుదల కావడం.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వెంటడాటంతో ‘శశి’ మూవీ టీంకు ఇది పెద్ద షాక్‌ అనే చెప్పుకోవాలి. అంతేగాక దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉంది. కాగా పైరసి వెబ్‌సైట్లు మూవీరూల్స్‌, తమిళరాక్స్‌తో పాలు పలు పైరసి వెబ్‌సైట్లలో ఈ మూవీ లింకులు వచ్చేశాయి. దీంతో ప్రేక్షకుల్లో అంతగా పాజిటివ్‌ టాక్‌ లేకపోవడంతో ఈ మూవీని థీయేటర్లో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

చదవండి: 
బిగ్‌బాస్‌ భామకు కరోనా పాజిటివ్‌

పైరసీ కారణంగా రూ.2,100 కోట్ల నష్టం
‘జాతిరత్నాలు’ టీమ్‌కి భారీ షాక్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు