‘లాల్‌ సింగ్‌ చద్దా’: ముగిసిన షూటింగ్‌, రిలీజ్‌ ఎప్పుడంటే..

18 Sep, 2021 08:18 IST|Sakshi

‘లాల్‌సింగ్‌’ ప్రయాణం ముగిసింది. ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. టైటిల్‌ రోల్‌లో ఆమిర్, హీరోయిన్‌గా కరీనా కపూర్‌ నటిస్తున్న ఈచిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్‌ ముగిసిన సందర్భంగా సెట్‌లో చిత్రబృందం కేక్‌ కట్‌ చేసి సెలబ్రెట్‌ చేసుకున్నారు. 

దేశవ్యాప్తంగా వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాటిలో తెలుగు రాష్రాల్లోని కాకినాడ, అమలాపురం, హైదరాబాద్‌ లొకేషన్లు కూడా ఉన్నాయి. 170 రోజులు షూటింగ్‌ జరిపారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా రపొందిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు