సోషల్‌ మీడియా ట్రోల్స్‌: అభిషేక్‌ స్పందన

1 Oct, 2020 12:54 IST|Sakshi

ముంబై: సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. కొన్నిసార్లు కోట్లాది మంది అభిమానులను కలిగిన ఉన్న హీరోలు సైతం సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొక తప్పదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో షూటింగ్‌లు, సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరిస్తూ సినిమా షూటింగ్స్‌ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అన్‌లాక్‌-5 లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో భాగంగా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లు కూడా ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ థియెటర్లలో 50 శాతం సీట్లను మాత్రమే కేటాయించాని పేర్కొంది. ప్రభుత్వం సినిమా హాల్స్‌కు ఇచ్చిన అనుమతుల సంబంధించిన ఓ వార్తను అభిషేక్‌ తన ట్విటర్‌లో  పోస్ట్‌ చేశారు. ‘ఈ వారానికి ఇదే అత్యంత గొప్ప వార్త’ అని కాప్షన్‌ కూడా జత చేశారు. ఆయన ట్విట్‌పై  కొంతమంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు. నెటిజన్ల ట్రోలింగ్‌కు ఆయన తనదైన శైలిలో సుతిమెత్తగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అభిషేక్‌ ట్విటర్‌ రిప్లై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘మీరు ఇక నిరుద్యోగులుగా ఉండరు?’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

దీనికి వెంటనే అభిషేక్‌ స్పందిస్తూ.. ‘అయ్యో, అది మీ(ప్రేక్షకుల) చేతిలో ఉంది. మీకు మా పని నచ్చకపోతే మాకు మరో మూవీలో నటించే ఉద్యోగం లభించదు. కావున మా శక్తి సామర్థ్యాలకు తగినట్లు పని చేస్తాము. ఉత్తమనైన ఫలితాలు రావాలని కోరుకుంటూ, దేవున్ని ప్రార్థిస్తాము’ అని సమాధానం ఇచ్చారు. ఇక అభిషెక్‌ బచ్చన్‌ గతంలో కూడా ఇలాంటి సోషల్‌ మీడియలో ట్రోలింగ్స్‌పై చాలా చాకచక్యగా స్పందిచిన విషయం తెలిసిందే.

ఇటీవల హీరో​యిన్‌ ప్రాచి దేశాయ్‌ కంటే తనకు ఎక్కువ ఫాలోవర్స్‌ ఉ‍న్నారని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. దానికి కూడా అభిషెక్‌ సున్నితంగా సమాధానం ఇచ్చారు. ‘సోషల్ మీడియాలో ఎంత మంది అనుచరులు ఉన్నారనేది నటన, ప్రతిభకు కొలమానం కాదు. ప్రతిభావంతులైన నటులను గుర్తించడానికి సోషల్‌ మీడియాకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం లేదు’ అని ట్విట్‌ చేశారు. కరోనా బారిన పడిన అభిషేక్‌, తన తండ్రి అమితాబ్‌, భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్య ఇటీవల వైరస్‌ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అభిషేక్‌ చివరగా బ్రీత్:‌ ఇంటూ ది షాడోస్‌లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్‌బుల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు