అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్‌ హీరో, వీడియో వైరల్‌

18 Nov, 2023 14:18 IST|Sakshi

సినిమా సక్సెస్‌ అయిందంటే ఆ సంతోషమే వేరు. చిత్రయూనిట్‌ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే! పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చేసినట్లే! అందుకే ఆ ఆనందాన్ని సక్సెస్‌ మీట్‌ల ద్వారా జనాలతో పంచుకుంటారు. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ మధ్య విజయాల్లేక అల్లాడిపోయిన బాలీవుడ్‌ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో తాజాగా టైగర్‌ 3 కూడా చేరింది. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఈ యాక్షన్‌ మూవీ జనాలకు విపరీతంగా నచ్చేసింది.

ఆరు రోజుల్లోనే అన్ని కోట్లు
మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 12న విడుదలవగా బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. నవంబర్‌ 17న చిత్రయూనిట్‌ అభిమానుల కోసం ముంబైలో ఓ స్పెషల్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సల్మాన్‌, కత్రినాతో పాటు ఇందులో విలన్‌గా నటించిన మరో హీరో ఇమ్రాన్‌ హష్మీ సైతం పాల్గొన్నాడు. వీరు టైగర్‌ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్‌ నింపారు.

సల్మాన్‌ ముద్దులు.. వీడియో వైరల్‌
తర్వాత సల్మాన్‌ మాట్లాడుతూ.. 'ఈ మూవీలో కత్రినా ఉంది. తనతో నేను చేసిన కొన్ని రొమాంటిక్‌ సీన్లు కూడా ఉన్నాయి. సినిమాలో ఇమ్రాన్‌.. ఆతిష్‌ పాత్రలో లేకపోతే ఇలా జరిగి ఉండేది' అంటూ సరదాగా అతడి దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టాడు. సల్మాన్‌-ఇమ్రాన్‌ బ్రొమాన్స్‌ చూసిన జనాలు ఘొల్లుమని నవ్వారు. ముద్దు సన్నివేశాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఇమ్రాన్‌ హష్మీ గురించి సల్లూ భాయ్‌ మాట్లాడుతూ.. 'నేను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్‌కు అది బాగా అలవాటు.. దాన్ని మిస్‌ అవుతున్నాడేమో. అందుకే ఆ వెలితిని పూడ్చేశా' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

A post shared by Viral Bhayani (@viralbhayani)

A post shared by Viral Bhayani (@viralbhayani)

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్‌ డైరెక్టర్‌ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్‌?

మరిన్ని వార్తలు